Elon Musk : మస్క్ స్టార్ లింక్ తో ఓజోన్ పొరకు ప్రమాదం

టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ( Elon Musk ) టెక్నాలజీ కారణంగా ఓజోన్ పొరకు ప్రమాదం పొంచి ఉండొచ్చని సైంటిస్టులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలకు ఎలాన్ మస్క్ స్టార్ లింక్ శాటిలైట్ సర్వీస్ ను ఏర్పాటుచేశారు. ఈ సంస్థలు ఇప్పుడు మొత్తం మానవాళికే ప్రమాదం తెచ్చేలా ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇది ఓజోన్ పొరను దెబ్బతీస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చిన్న యాంటెన్నా సాయంతో ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా సులభంగా ఇంటర్నెట్ సేవలు అందించే ఉద్దేశంతో అంతరిక్షంలోకి స్టార్ లింక్ శాటిలైట్లను పంపారు. ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ STARLINK ఎక్స్ దీనిని ఏర్పాటు చేసింది. దీని వలన అత్యంత వేగంగా ఇంటర్నెట్ వచ్చే అవకాశాలు ఉన్నా ఇప్పుడు అది ఓజోన్ పొరకే ప్రమాదంగా మారింది. సైంటిస్టులు మరిన్ని పరిశోధనలు ఈ దిశగా కొనసాగిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com