ఇక డ్రోన్స్ ఆలోచిస్తాయట.. శాస్త్రవేత్తల వినూత్న సృష్టి..!

ఇక డ్రోన్స్ ఆలోచిస్తాయట.. శాస్త్రవేత్తల వినూత్న సృష్టి..!

Artificial Brain For Drone: ప్రపంచవ్యాప్తంగా న్యాయ మరియు రక్షణ వ్యవస్థలు నేరాలను ఆపడానికి లేదా నేరాలు జరిగినపుడు స్పందించే సమయాన్ని మెరుగుపరుచుకునే దిశగా ఎంతగానో కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో తమను తాము సర్వ సన్నద్ధం చేసుకునేందుకు సాంకేతికతను పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నాయి. ఇందులో బాగంగానే రక్షణ వ్యవస్థలో డ్రోన్‌లని ఉపయోగించబోతున్నారట వ్యవస్థలు. జన సముహలని, పెద్ద పెద్ద ప్రాంతాలను పర్యవేక్షించేందుకు డ్రోన్‌లను మోహరిస్తున్నారట.

Artificial Brain For Drone:

ఇది చాలా ఉపయోగకరమైనదే అయినప్పటికీ.. డ్రోన్స్ కి ఏవి సాదారణ పరిస్తుతలో, ఏవి అసాదారణ పరిస్థితులో నిర్ణయించే సామర్థ్యం ఉండదు.. కాబట్టి ఈ సమస్యని అధిగమించడానికి చెక్ శాస్త్రవేత్తల బృందం ఈ డ్రోన్స్ కి అసాదారణపరిస్థితులను గుర్తించే సామర్థ్యాన్ని అందించాలని నిర్ణయించుకున్నారట. మానవ మెదడు తరహాలో డ్రోన్ ఫుటేజీని విశ్లేషించే సామర్థ్యంగల నిఘా వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు చెక్ శాస్త్రవేత్తల బృందం తెలిపింది.

బ్ర్నో(Brno) యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ మరియు చెక్ రిపబ్లిక్ పోలీసుల మధ్య జాయింట్ రీసెర్చ్ ప్రోగ్రామ్‌గా అభివృద్ధి చేయబడిన ఈ కొత్త సిస్టమ్ డేటాను డీకోడ్ చేయడానికి న్యూరల్ నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తుంన్నారట. నిఘా మరియు క్రౌడ్ కంట్రోల్‌తో పాటు, దీనిని ట్రాఫిక్ నిర్వహణకు కూడా ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.

యూనివర్శిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫ్యాకల్టీ నుండి తాజా గ్రాడ్యుయేట్ అయిన "డేవిడ్ బాసౌట్" మరియు అతని బృందం ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో వివరిస్తూ.. రేడియో ప్రేగ్ ఇంటర్నేషనల్ అనే డ్రోన్ ఫుటేజ్ ని చిన్న కణాలుగా విభజించి విశ్లేసహించి.. అక్కడ పరిస్థితిని సాదరనమైనదా లేదా అసాదరనమైనదా అనే విషయాన్ని గుర్తిస్తుంది. అక్కడి వాతావరణ పరిస్తితిన అంచనా వేసి ఇచ్చిన ఆదేశాలకి విరుద్దంగా ఏదైనా జరుగుతుంటే వెంటనే పరిశీలకుడికి సమాచారాన్ని అందిస్తుందని. దాని వాళ్ళ వ్యవస్థలు వెంటనే తగు జాగ్రతలు పడొచ్చని అయ్యాన వివరించారు.



Tags

Read MoreRead Less
Next Story