అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్..లాంచ్ ఎప్పుడంటే?

గూగుల్ భాగస్వామ్యంతో చవకైన స్మార్ట్‌ఫోన్ విడుదల చేయనున్నట్లు రిలయన్స్ జియో 44వ వార్షిక సదస్సులో ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ ఇదే కానుందని ముకేష్ అంబానీ ఈ సదస్సులో పేర్కొన్నారు. ఈ ఫోన్ కు ముందుగానే జియో నెక్ట్స్ అని పేరు కూడా పెట్టారు. ఈ ఫోన్ సెప్టెంబర్‌లో అధికారికంగా లాంచ్ కానుంది. ఇప్పుడు దీని స్పెసిఫికేషన్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆండ్రాయిడ్ 11(గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టం
వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరా
ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా
హెచ్‌డీ+ డిస్‌ప్లే
ఈ ఫోన్ మోడల్ నంబర్ LS-5701-Jగా ఉండనుంది
జియో ఫోన్ నెక్స్ట్ స్క్రీన్ రిజల్యూషన్ 720x1,440 పిక్సెల్స్
క్వాల్‌కాం క్యూఎం215 ప్రాసెసర్
64 బిట్ క్వాడ్‌కోర్ మొబైల్ ప్రాసెసర్.
బ్లూటూత్ వీ4.2, జీపీఎస్, 1080పీ వీడియో రికార్డింగ్,
ఎల్పీడీడీఆర్3 ర్యామ్, ఈఎంఎంసీ 4.5 స్టోరేజ్
గూగుల్ కెమెరా గో అనే ఫీచర్
మనదేశంలో రూ.4 వేలలోపే ఉండనుంది.
సెప్టెంబర్ 10 నుంచి సేల్‌కు వెళ్లనుంది.
అయితే జియో ధరను అధికారికంగా ప్రకటించలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com