SSLV-D1: ఎస్‌ఎస్‌ఎల్వీ-డి1 రాకెట్‌ ప్రయోగం ఆఖర్లో సాంకేతిక లోపం..

SSLV-D1: ఎస్‌ఎస్‌ఎల్వీ-డి1 రాకెట్‌ ప్రయోగం ఆఖర్లో సాంకేతిక లోపం..
SSLV-D1: ఎస్‌ఎస్‌ఎల్వీ-డి1 రాకెట్‌ విజయవంతంగా ఉపగ్రహాల్ని నింగిలోకి మోసుకెళ్లింది.

SSLV-D1: ఎస్‌ఎస్‌ఎల్వీ-డి1 రాకెట్‌ విజయవంతంగా ఉపగ్రహాల్ని నింగిలోకి మోసుకెళ్లింది. కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. కానీ ఆఖరు నిమిషంలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా.. షార్‌ కంట్రోల్‌ సెంటర్‌కి సిగ్నల్ అందడం లేదు. ఇలా ఎందుకు జరిగింది, ఏంటి కారణం అనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఈ ప్రయోగంలో భాగంగా SSLV మొదటి మూడు దశలు అనుకున్నట్టే పూర్తయ్యాయి. ఆ తర్వాతే సమస్య తలెత్తింది.

ఈ నేపథ్యంలో ఉపగ్రహాలు నిర్దేశిత కక్ష్యలోనే ఉన్నాయా.. వాటి పనితీరు ఎలా ఉంది అనేది విశ్లేషించేందుకు కొంచెం సమయం పట్టేలా కనిపిస్తోంది. డేటాను పరిశీలించాక మిషన్‌ ఫలితంపై ప్రకటన చేస్తామని ఇస్రో ఛైర్మన్‌ సోమ్‌నాథ్‌ తెలిపారు. ఇప్పటివరకు మన ఇస్రో PSLV, GSLV లాంటి వాటి ద్వారా ఉపగ్రహాలను నింగిలోకి పంపేది. ఈసారి చిన్న రాకెట్లను రోదసీలోకి పంపేందుకు 'స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌'- SSLVని ఉపయోగించింది.

తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో వాణిజ్య ప్రయోగాలు చేపట్టే లక్ష్యంతో ఈ SSLVని సిద్ధం చేశారు. ఇవాళ ఉదయం 9 గంటల 18 నిమిషాలకు శ్రీహరికోట షార్‌లోని మొదటి లాంచ్‌ ప్యాడ్‌ నుంచి SSLV D-1 నింగిలోకి దూసుకెళ్లింది. 12 నిమిషాలు అనుకున్నట్టే నిర్దేశిత మార్గంలోనే ప్రయాణం సాగినా.. ఆఖరు నిమిషంలో టెక్నికల్ సమస్యతో ప్రాజెక్ట్‌ రిజల్ట్‌ ప్రశ్నార్థకమైంది. ఇవాళ లియో ఆర్బిట్‌లోకి రెండు ఉపగ్రహాల్ని ప్రవేశపెట్టారు. వాటిల్లో ఒకటి ఆజాదీ శాట్‌. దీని బరువు 8 కేజీలు.

75 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా దీన్ని సిద్ధం చేశారు. దీని జీవిత కాలం ఆరు నెలలు మాత్రమే. ఇక మరో ఉపగ్రహం EOS-2. ఇది 140 కేజీలు ఉంటుంది. ఇది మారుమూల ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ పెంచే లక్ష్యంతో తయారు చేసింది. ఇప్పుడీ ఉపగ్రహాల టెక్నికల్‌ ఇష్యూస్‌, డేటా లాస్‌ కారణంగా అనుకున్న కక్ష్యలో అవి ఉన్నాయో లేదో చెప్పడానికి సమయం పడుతుందని ఇస్రో ఛైర్మన్ అంటున్నారు. మొదటి మూడు దశల తర్వాత టెర్మినల్‌ దశలో ఈ సమస్య ఎందుకు తలెత్తిందో కనిపెట్టి, పరిష్కరించేందుకు ఇంజినీర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story