Twitter-Threads: థ్రెడ్స్ యాప్‌కి వెళ్లకుండా అడ్డుకుంటున్న ట్విట్టర్

Twitter-Threads: థ్రెడ్స్ యాప్‌కి వెళ్లకుండా అడ్డుకుంటున్న ట్విట్టర్
*ట్విట్టర్‌కు 11 శాతానికి పైగా తగ్గిన వెబ్ ట్రాఫిక్

ఇటీవల సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌కు పోటీగా ఫేస్‌బుక్(Facebook) మాతృసంస్థ మెటా(Meta) సంస్థ విడుదల చేసిన థ్రెడ్స్(Threads) యాప్ అతి తక్కువ సమయంలోనే 100 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఆ మార్క్ దాటిన కంపెనీగా ఛాట్‌జీపీటీ(ChatGPT)ని దాటి రికార్డ్ సృష్టించింది. దీంతో ట్విట్టర్(Twitter) యాజమాన్యం థ్రెడ్ కార్యకలాపాల్ని నిశితంగా గమనిస్తోంది. ఇన్‌స్టాగ్రాంకి అనుసంధానంతో థ్రెడ్ యాప్ పనిచేస్తోంది. ఈ యాప్‌లో ఇప్పటికే ప్రముఖులంతా చేరి దానికి ప్రచారం కల్పిస్తున్నారు. ఈ యాప్ ప్రభావం ట్విట్టర్‌పై బాగానే పడినట్లుంది.


అయితే ట్విట్టర్ తన యాప్ సెర్చ్ రిజల్ట్స్‌లో థ్రెడ్స్ యాప్‌కి రీడైరెక్ట్ అయ్యే, థ్రెడ్స్‌కి సంబంధించిన లింకులను బ్లాక్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. అంటే ట్విట్టర్‌ యూజర్లు థ్రెడ్స్ యాప్‌కి సంబంధించిన ఏదైనా సమాచారాన్ని చూడలేరన్నమాట. అయితే దీనిపై అధికారికంగా ఎవరూ స్పందించలేదు.

ఆండీ బయో అనే ఒక యూజర్ దీనిని గుర్తించి వెల్లడించాడు. url:threads.net అనేది Threads.net వెబ్‌సైట్ సంబంధించిన ట్వీట్లు చూయించాలి. కానీ అసలు ఏమీ చూయించలేదని ఆ యూజర్ వెల్లడించాడు.

అలాగే మరో యూజర్ చెబుతూ.. థ్రెడ్ యాప్‌ లింక్స్‌కి సంబంధించిన ట్వీట్లు ఏవీ కూడా కనిపించడం లేదంటూ మరో యూజర్ తెలిపాడు.

ట్విట్టర్ తన పోటీ సంస్థల లింక్‌లను బ్లాక్‌ చేయడం ఇదే మొదటిసారికాదు. ఇంతకు ముందు సబ్‌స్టాక్ వెబ్‌సైట్‌ లింకులతో కూడిన ట్వీట్లను కూడా లైక్, రీట్వీట్, రిప్లై చేసే వీలు లేకుండా నియంత్రించింది. సబ్ స్టాక్ ట్విట్టర్ డేటాబేస్‌లోని సమాచారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుంటోందని తన నిర్ణయాన్ని సమర్థించుకుంది.


అయితే 2023 జులై 6న థ్రెడ్స్ యాప్ విడుదలైనప్పటి నుంచీ ట్విట్టర్, మెటా మధ్య పోటీ మొదలైంది. 100 కోట్ల మంది ఒకే చోట మాట్లాడుకోవడానికి థ్రెడ్ యాప్‌ తెచ్చామని లాంఛ్ సమయంలో వెల్లడించింది. థ్రెడ్స్ వచ్చిన తర్వాత ట్విట్టర్‌కు వెబ్ ట్రాఫిక్ 11 శాతానికి పైగా తగ్గిందని వెల్లడైంది.

ఈ కంపెనీల మధ్య వైరం బాగా పెరిగింది. మెటా సీఈవో మార్క్ జుకన్‌బర్గ్, ట్విట్టర్ సీఈవో ఎలన్‌ మస్క్‌లు సరదాగా ఒక కేజ్ ఫైట్‌లో తలపడాలని అనుకున్నారు. ట్విట్టర్ మాజీ ఉద్యోగులను నియమించుకుని, తమ వాణిజ్య రహస్యాలు, మేధోసంపత్తిని ఉపయోగించుకుని ట్విట్టర్‌కు నకలు యాప్‌ని తయారుచేసినందుకు కోర్టుకు వెళ్తామని ఇటీవల బెదిరించింది.




Tags

Read MoreRead Less
Next Story