వాట్సాప్‌లో అద్భుతమైన కొత్త ఫీచర్స్

మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇటీవల కాలంలో తరుచూ కొత్త ఫీచర్స్ తీసుకొని వస్తుంది. దీంతో యూజర్లను మరింతగా ఆకట్టుకుంటుంది. తాజాగా 2.20.200.6 పేరుతో కొత్త వెర్షన్ అప్‌డేట్ త్వరలో రానుంది. చాలా అంశాల్లో కొత్త ఫీచర్స్ రానున్నాయి. యూజర్ల నుంచి వస్తున్న ఫిర్యాదులను, కొత్త ఆలోచనలను కలిపి ఈ ఫీచర్లను తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం కొత్త ఫీచర్స్ అన్ని బీటా యూజర్స్ కి అందుబాటులో ఉన్నాయి. పరీక్షలు పూర్తైన తరువాత అందరికీ అందుబాటులోకి వస్తాయి.
అయితే కొత్తగా రానున్న ఫీచర్స్..
1. స్టిక్కర్స్‌లో తరుచూ కొత్తకొత్తవి అందుబాటులోకి తెస్తున్న వాట్సాప్.. తాజాగా మరిన్ని స్టిక్కర్స్ అందుబాటులోకి తీసుకురానుంది. Usagyuuun పేరుతో ఈ కొత్త యానిమేటెడ్ స్టిక్కర్ ప్యాక్ పరిచయం కానుంది. ఈకొత్త స్టిక్కర్స్ ప్రస్తుతం వాట్సాప్ ఐఓఎస్ యూజర్స్‌కి అందుబాటులో ఉన్నాయి. అయితే, త్వరలో పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులోకి రానున్నాయి. ఇటీవల పలు వృత్తులు చేస్తున్న వారి ఎమోజీలతో కొత్త యూనిమేటెడ్ స్టిక్కర్ ప్యాక్‌ను వాట్సాప్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
2. వాల్‌పేపర్ డిమ్ చేసుకునేలా మరో ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీనిపై పరీక్షలు జరుగుతున్నాయి. అన్ని అనుకున్నట్టు జరిగితే అతి త్వరలోనే యూజర్స్ కి అందుబాటులోకి వస్తుందని వాబీటా ఇన్ఫో తెలిపింది.
3. స్టోరేజ్ యూసేజ్ అనే సెక్షన్ ను వాట్సాప్ గతంలో అందుబాటులోకి తీసుకొని వచ్చింది. అయితే, దీనిపై యూజర్ల నుంచి చాలా ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో సంస్థ వాటిని కరెక్షన్ చేస్తుంది. స్టోరేజ్ యూసేజ్ అనే సెక్షన్ ఓపెన్ చేస్తే వాట్సాప్ క్రాష్ అవుతోందని చాలా ఫిర్యాదులు వెళ్లాయి. ఈ లోపాన్ని సరిచేసి కొత్తగా వెర్షన్ తీసుకొని వస్తున్నట్టు తెలిపింది.
వీటితో పాటు గ్రూప్ చాట్ చేసేటప్పడు ఒక్కో వ్యక్తికి ఒక్కో రింగ్ టోన్ పెట్టుకునేలా మరో ఫీచర్ ను పరిశీలిస్తున్నారు. ఇలా చాలా కొత్త పీచర్స్ వస్తాయని సంస్థ తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com