వాట్సా‌ప్‌ మెసేజ్‌ హ్యాకర్ల కలకలం

వాట్సా‌ప్‌ మెసేజ్‌ హ్యాకర్ల కలకలం
. ''ఎమర్జెన్సీ హెల్ప్'' అంటూ వాట్సాప్‌ చాట్‌లను హ్యాక్‌ చేశారు.

బీకేర్‌ ఫుల్‌.. వాట్సప్‌ మెసేజ్‌లతో ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా.. జరగాల్సిన డామేజ్‌ జరిగిపోతోంది.. సైబర్‌ నేరగాళ్లు మీ వాట్సప్‌పై కన్నేసి ఉంచుతున్నారు.. అలర్ట్‌గా లేకపోతే వాళ్ల వలలో చిక్కుకోవాల్సిందే.. తాజాగా హైదరాబాద్‌లో పలువురి ప్రముఖుల వాట్సప్‌ హ్యాక్‌ అవ్వడం కలకలం రేపుతోంది. మొదట ఎమర్జెన్సీ పేరుతో పలువురికి వాట్స్‌ప్‌లో మెసేజ్‌లు పంపిస్తున్నారు. అత్యవసర సాయం అంటూ ఆరు డిజిట్ల కోడ్‌తో ఎస్.ఎం.ఎస్‌లు పంపిస్తున్నారు.. తరువాత ఆ ఓటిపి నెంబర్‌ చెప్పండి అంటూ రిక్వెస్ట్‌ పెడుతున్నారు.. తెలిసిన నెంబర్ నుంచే మెసేజ్ వచ్చిందని ఓటీపీ చెపితే.. వెంటనే వాళ్ల వాట్సప్‌ అకౌంట్‌ ను క్రాష్‌ చేస్తున్నారు.

ఇటీవల ఇలా మోసపోయిన బాధితుల్లో సెలబ్రిటీలు, డాక్టర్లు కూడా ఉన్నారు. పలువురు ప్రముఖులను టార్గెట్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు.. వారి కాంటాక్ట్‌లో ఉన్న కొన్ని నెంబర్లును సేకరించి.. ఆయా నంబర్లు హ్యాక్ చేసి వాటినుంచి మెసేజ్ లు వెళ్లేట్టు చేస్తున్నారు. ఎమర్జెన్సీ హెల్ప్‌ అంటూ ఆరు డిజిట్ల కోడ్‌తో ఎస్‌ఎంఎస్‌లు పంపిస్తారు. ఓటీపీ నెంబర్‌ పంపాలంటూ రిక్వెస్ట్‌ చేస‌్తారు. ఆ మెసేజ్‌ తెలిసిన వాళ్ల నంబర్ నుంచే వచ్చిందనే నమ్మకంతో వారు రిప్లై ఇస్తున్నారు..

మొదట కొందరి వ్యక్తుల నెంబర్‌ను హ్యాక్‌ చేస్తారు.. తరువాత ఆ నంబర్ నుంచి కాంటక్ట్ లో ఉన్న నెంబర్ లకు రిక్వెస్ట్‌ పెడతారు.. ఇలా చాలా మందిని టార్గెట్‌ చేసి.. ''ఎమర్జెన్సీ హెల్ప్'' అంటూ వాట్సాప్‌ చాట్‌లను హ్యాక్‌ చేశారు. దీనిపై పలు ఫిర్యాదులు అందడంతో విచారణ చేపట్టిన పోలీసులు వాట్సాప్‌ హ్యాక్‌పై ఆరా తీస్తున్నారు. వాట్సాప్‌లో వచ్చే కోడ్‌ మెసేజ్‌లను.. ఎవరికీ పంపొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. కోడ్‌ పంపితే వ్యక్తిగత సమాచారాన్ని సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేస్తారని హెచ్చరిస్తున్నారు. ఇక సైబర్‌ భద్రతా నిపుణులు సైతం.. ఎట్టి పరిస్థితుల్లో కోడ్‌ చెప్పొద్దని.. హ్యాకర్లతో ప్రమాదం పొంచి ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సో బీకేర్‌ ఫుల్‌ వాట్సప్‌ యూజర్స్‌.

Tags

Read MoreRead Less
Next Story