WhatsApp: వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్...

WhatsApp: వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్...

ప్రజల జీవితాల్లో ఒక భాగమైపోయింది ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్. వాట్సాప్ లేకుంటే రోజువారీ పనులు ఆగిపోయేంతలా ప్రభావితం చేసింది.

అయితే వాట్సాప్ తన వినియోగదారులకి అదిరిపోయే వార్త తెలిపింది. ఇప్పుడు వినియోగదారులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కువ నాణ్యత ఉండే HD వీడియోలు పంపించుకునే సదుపాయం తెస్తున్నట్లు తెలిపింది. ఇటీవలె ఎక్కువ నాణ్యత(HD) ఉన్న ఫోటోలను పంపే సౌలభ్యం అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు వీడియోలను కూడా నాణ్యతలో తేడా లేకుండా పంపుకునే సౌలభ్యం తేనున్నట్లు తెలిసింది. కొందరు వాట్సాప్ బీటా వెర్షన్ వినియోగదారులకు ఈ సౌలభ్యం ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది.



WABetaInfo ప్రకారం.. హై రిజల్యూషన్(HD) వీడియోలపై HD ఆప్షన్‌ని ఎంపిక చేసుకునే సౌలభ్యం రానుంది. అంటే వీడియో పంపే ముందు HD రూపంలో పంపాలా లేదా సాధారణ వీడియోగా పంపాలా అనే సదుపాయాన్ని వినియోగదారులే నిర్ణయించుకోవచ్చు.

వీడియోలు, ఫోటోలు హై రిజల్యూషన్‌లో ఉంటే వాటిని మరింత స్పష్టంగా చూడవచ్చు. కానీ ఇది వరకు వినియోగదారులు పంపే వీడియోలు, ఫోటోలు అధిక నాణ్యతలో కాకుండా, వాటి నాణ్యత కుదించబడి, తక్కువ సైజుతో వెళ్లేవి. అవి అంత స్పష్టంగా కనబడేవి కాదు. వాట్సాప్‌ తన వినియోగదారులు పంపే వీడియోలను డేటా వినియోగం, స్టోరేజ్ తగ్గించేలా ఆటోమేటిక్‌గా వీడియోల నాణ్యత కుదింపజేసేది. ఇప్పుడు ఈ సదుపాయంతో హై రిజల్యూషన్‌ వీడియోలను నాణ్యత తగ్గించకుండానే పంపుకోవచ్చు.

ఈ కొత్త ఫీచర్ ఉపయోగించుకోవాలంటే ఆండ్రాయిచ్ వినియోగదారులు బీటా వర్షన్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఇప్పటికే బీటా వెర్షన్ ఉపయోగిస్తున్న వారు 2.23.14.10 నూతన వర్షన్‌కి అప్‌డేట్ కావాలి.

ఈ ఫీచర్‌తో పాటుగా వినియోగదారులు ఒకేసారి 100 ఫోటోలు పంపే సౌలభ్యంపై కూడా పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే ఒకే సారి 100 ఫోటోల వరకు పంపుకోవచ్చు. ఇప్పటిదాకా కేవలం 30 ఫోటోలను మాత్రమే పంపే వీలుండేది. ఎక్కువ ఫోటోలు పంపాలంటే ప్రతీసారి 30 ఫోటోలను మళ్లీ మళ్లీ పంపాల్సి వచ్చేది. వినియోగదారులకు ఇది సౌకర్యవంతంగా లేదు. వాట్సాప్‌కు ప్రత్యర్థి అయిన టెలిగ్రామ్‌ యాప్‌లో ఒకే సారి నచ్చినన్ని ఫోటోలు పంపుకునే సౌలభ్యం ఎప్పటినుంచో అందుబాటులో ఉంది.


Tags

Read MoreRead Less
Next Story