WhatsApp: వాట్సాప్ సేవలకు బ్రేక్.. సడన్‌గా సాంకేతిక లోపం

WhatsApp: దేశంలో వాట్సాప్ సేవలకు బ్రేక్ పడింది. సడన్‌గా సాంకేతిక లోపం ఏర్పడి వాట్సప్ సేవలు నిలిచిపోయాయి. సర్వర్ డౌన్ అవ్వడంతో యూజర్లు అయోమయనికి గురవుతున్నారు. పంపిన మెసెజ్‌లు డెలివరీ అయ్యాయా లేదా అని డైలామాలో పడిపోయారు. మెసేజ్ డెలివరీ స్టేటస్‌ను వాట్సాప్ చూపించకపోవడంతో వినియోగదారులు ఆందోళన పడుతున్నారు. వాట్సాప్‌లో డబుల్ టిక్ , బ్లూటిక్ మార్కులు చూపించడం లేదు. దీంతో యూజర్లు మేటా కంపెనీకి ఫిర్యాదులు చేస్తున్నారు.
మధ్నాహ్నాం 12గంటల 29 నిమిషాల నుంచి సేవలు నిలిచిపోవడంతో META సంస్థ స్పందించింది. సమస్య ఎక్కడ తలెత్తిందో పరిశీలిస్తున్నామని ప్రకటించింది. ఇటు సమస్యను పరిష్కరించే పనిలో పడ్డామని ప్రొవైడర్లు తెలిపారు. గతంలోనూ వాట్సాప్ సేవలకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తాయి. అప్పుడు వెంటనే సమస్యను రిక్టిఫై చేసి సరిచేశారు. ఇప్పుడు కూడా నిర్వాహకులు ప్రాప్లమ్‌ను ట్రేస్ చేసే పనిలో పడ్డారు.
భారత్ సహా ఇతర దేశాల్లోనూ వాట్సాప్ సేవలకు అంతరాయం ఏర్పడిందని తెలుస్తోంది. వాట్సాప్ దీనిపై ఇంకా స్పందించలేదు. వాట్సాప్ పనిచేయడం లేదని తెలీడంతో అప్పుడే నెటిజన్లు ఫన్నీ మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. వాట్సాప్ యూజర్లంతా ట్విటర్‌వైపు పరుగులు తీస్తున్నారని ఒకరు కామెంట్ పెడితే.. వాట్సాప్‌కు గ్రహణం పట్టిందంటూ మరొకరు ట్వీట్ చేశారు.
2009 నవంబర్ నుంచి వాట్సప్ సేవలు ప్రారంభయ్యాయి. 2010లో అండ్రాయిడ్ యూజర్లకు వాట్సప్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ 12ఏళ్లలో అనేక సార్లు వాట్సాప్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం 150 దేశాల్లో వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది వాట్సప్ యూజర్స్ ఉన్నారు. ఇలా సమాచార వ్యవస్థలో మోస్ట్ పాపులపర్ మెసెంజర్ సర్వీస్‌గా గుర్తింపు పొందింది వాట్సప్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com