పల్మనాలజీ సదస్సును ప్రారంభించిన మంత్రి హరీష్

పల్మనాలజీ సదస్సును ప్రారంభించిన మంత్రి హరీష్
అంతర్జాతీయ పల్మనాలజీ సదస్సు లైవ్ వర్క్‌ షాప్‌ను హరీశ్ రావు ప్రారంభించారు

హైదరాబాద్‌లో అంతర్జాతీయ పల్మనాలజీ సదస్సును నిర్వహించడం అభినందనీయమని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు .హైదరాబాద్ నోవాటెల్‌లో రెండు వేల మంది వైద్యలతో నిర్వహించనున్న అంతర్జాతీయ పల్మనాలజీ సదస్సు లైవ్ వర్క్‌ షాప్‌ను హరీశ్ రావు ప్రారంభించారు . ఉపరితిత్తుల వ్యాధుల నివారణకు ప్రపంచ వ్యాప్తంగా అమలు విధానం చేస్తున్న విధానాలపై ఈ సదస్సులో చర్చిస్తున్నట్లు యశోద హాస్పిటల్ డైరెక్టర్ పవన్ గోరుకంటి అన్నారు.

ఉపిరితిత్తుల క్యాన్సర్‌ నివారణకు మొదటి సారిగా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ సాఫ్ట్‌వేర్‌ను , నావిగేషన్ బ్రోంకోస్కోపీని లాంటి అత్యాధునిక విధానాలను యశోద ఆసుపత్రి అందుబాటులోకి తీసుకువచ్చిందని పవన్ గోరుకంటి వెల్లడించారు. ఉపిరితిత్తులకు వచ్చే వ్యాధులు నిర్ధారణ, చికిత్స విధానాలపై వైద్యులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించమే ధ్వేయంగా బ్రాంకస్ 2023 సదస్సు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ హరికిషన్ తెలిపారు.

Tags

Next Story