జావెద్‌ గ్యాంగ్‌పై కేసు ఎన్‌ఐఏ కు బదిలి

జావెద్‌ గ్యాంగ్‌పై కేసు ఎన్‌ఐఏ కు బదిలి
పాకిస్తాన్, నేపాల్ మీదుగా జావెద్ గ్యాంగ్ హైదరాబాద్‌కు పేలుడు పదార్ధాలను తరలిచింది.

హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర పన్నిన జావెద్‌ గ్యాంగ్‌పై ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. దసరా పండుగ సమయంలో జావెద్ గ్యాంగ్ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు అధికారులు గుర్తించారు. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. ఇప్పటికే చంచల్‌గూడ జైలులో జావేద్‌, అతని అనుచరులు రిమాండ్‌ ఖైదీలుగా ఉన్నారు. టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయం పేలుడు ఘటనలో కూడా జావేద్‌ నిందితుడుగా ఉన్నాడు. పాకిస్థాన్, నేపాల్ మీదుగా భారత్ కు జావేద్‌ ముఠా గ్రనేడ్లు తరలించారు. 2022 డిసెంబర్ మాసంలో జావెద్ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

దసరా పండుగ రోజున బాంబ్ బ్లాస్ట్ జరపాలని జావెద్ గ్యాంగ్ కుట్ర పన్నింది. ఈ ఘటనకు సంబంధించి ఎన్ఐఏ తమ దర్యాప్తులో కీలక విషయాలను వెలుగులోకి తెచ్చింది. హైదరాబాద్‌లోని రద్దీ ప్రాంతాల్లో బ్లాస్టింగ్‌ చేయాలని నిందితులు కుట్ర పన్నినట్లుగా తెలుస్తోంది. దేశంలో అంతర్గత భద్రతకు ముప్పు కల్గించేలా జావెద్ గ్యాంగ్ ప్లాన్ చేసినట్లు హైదరాబాద్‌లో పట్టుబడిన ఉగ్రవాదిని విచారించగా తెలిసింది.

Tags

Read MoreRead Less
Next Story