తెలంగాణ బడ్జెట్ అంకెల గారడీ

తెలంగాణ బడ్జెట్ అంకెల గారడీ
X
ఐటీఐఆర్‌పై ప్రభుత్వం అబద్ధాలు చెప్తోంది

తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్‌ను అంకెల గారడీగా అభివర్ణించారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఐటీఐఆర్‌పై తెలంగాణ ప్రభుత్వం అబద్ధాలు చెప్తోందన్నారు. ఐటీఐఆర్‌పై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు. ఇమ్లిబన్‌ నుంచి ఫలక్‌నుమాకు మెట్రో ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎంఐఎం కూడా బాధ్యత వహించాలన్నారు. కేంద్రం నిధులు కేటాయించలేదనడం అబద్ధమని రఘునందన్‌రావు స్పష్టం చేశారు.

Tags

Next Story