వ్యవసాయం పరిశ్రమగా మారాలి : మంత్రి నిరంజన్ రెడ్డి

వ్యవసాయం పరిశ్రమగా మారాల్సిన అవసరం ఉందన్నారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. మారుతున్న ఆహారపు అలవాట్లు, పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయం చేయాలన్నారు. మెదక్ జిల్లా మనోహరబాద్ మండలం ముప్పిరెడ్డిప్లలి శివారులోని అక్షయ అగ్రి MSG యూనిట్‌ను మంత్రి నిరంజన్ రెడ్డి సందర్శించారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు.
సంప్రదాయ పద్ధతిలో కాకుండా ఆధునికత జోడించి...సాగు చేయాలన్నారు నిరంజన్ రెడ్డి. ప్రపంచ ఆహారపు అవసరాలను తీర్చగల శక్తి ఇండియా సహా కొద్దిదేశాలకే ఉందన్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయపరికరాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలకు భారతదేశం ఆహారాన్ని అందించగలదన్నారు . రాష్ట్రంలో ఐదెకరాల లోపు 95శాతం మంది రైతులు ఉన్నట్లు తెలిపారు. తక్కువ భూమిలోనే మంచి పంటను పండించాలన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com