తెలంగాణలో మాణిక్‌రావ్‌ ఠాక్రే పర్యటన

తెలంగాణలో మాణిక్‌రావ్‌ ఠాక్రే పర్యటన
X
ఇవాళ సూర్యాపేట జిల్లా కోదాడ, నల్గొండ జిల్లా నేతలతోపాటు నల్గొండ లోక్‌సభ సెగ్మెంట్‌ ముఖ్యనేతలతో భేటీ

బుధవారం(నేటి) నుంచి ఐదు రోజులపాటు రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావ్‌ ఠాక్రే పర్యటించనున్నారు. ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఇవాళ సూర్యాపేట జిల్లా కోదాడ, నల్గొండ జిల్లా నేతలతోపాటు నల్గొండ లోక్‌సభ సెగ్మెంట్‌ ముఖ్యనేతలతో భేటీ అవుతారు. సాయంత్రం హాత్‌సే హాత్‌ జోడో యాత్రలో భాగంగా ఇంటింటి ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రాత్రి కోదాడ బార్డర్‌ మునగాల దగ్గరకు రాగానే మాణిక్‌రావ్‌ ఠాక్రేకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి సన్మానించారు. పెద్ద ఎత్తున బైక్‌ ర్యాలీ మధ్య కోదాడకు చేరుకున్నారు ఠాక్రే.

Tags

Next Story