రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో గుర్రపు స్వారి పోటీలు

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో గుర్రపు స్వారి పోటీలు
ఒలింపిక్ క్రీడ అయిన షో జంపింగ్ పోటీలలో అత్యధిక రైడర్లు తయారు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపిన రాంచొ డీకబాలోస్ పార్ట్‌నర్‌

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం అజీజ్‌నగర్‌లో హైదరాబాద్‌ హార్స్‌ అండ్‌ పోలో రైడింగ్‌ క్లబ్‌లో గుర్రపు స్వారి పోటీలు, విన్యాసాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీవీ5 మీడియా పార్ట్‌నర్‌గా వ్యవహరించింది. ఒలింపిక్ క్రీడ అయిన షో జంపింగ్ పోటీలలో అత్యధిక రైడర్లు తయారు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు రాంచొ డీకబాలోస్ పార్ట్‌నర్‌ తెలిపారు. గుర్రపు స్వారీ పోటీలకు రైడర్ల నుంచి విశేష స్పందన లభించింది.

యువత గుర్రపు స్వారీ పోటీల్లో రాణించాల్సిన అవసరం ఉందని డీజీపీ అంజనీకుమార్ అన్నారు. డ్రగ్స్‌ లాంటి వ్యసనాలు, కంప్యూటర్ గేమ్స్‌కు బాసిన కాకుండా రియల్ గేమ్స్‌లో పాల్గొని సత్తా చాటుకోవాలన్నారు . అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌కు మంచి స్పందన ఉందని ..ఇలాంటి పోటీలు ఏడాదికి ఒక సారి కాకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించాలని కోరారు. గుర్రపు స్వారీ నేర్చుకోవడం వల్ల యువతీయువకులకు మంచి కల్చర్ ఏర్పడుతుందని జంతువులతో బాండింగ్ పెంపొందుతుందన్నారు. ప్రపంచ ఖ్యాతి చెందన క్రీడలు ప్రజలకు అవసరమన్నారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విజేతలకు బహుమతులు అందజేశారు .

హైదరాబాద్‌లో ఈక్వెస్ట్రియన్ ఫెస్ట్ 2023 షో జంపింగ్ కాంపిటీషన్స్‌ నిర్వహించడం సంతోషంగా ఉందని తమ సత్తాను నిరూపించుకునేందుకు ఇది చక్కటి ఫ్లాట్ ఫాం అని రైడర్లు అన్నారు. 8 నెలల పాటు హార్స్ రైడింగ్ , షో జంపింగ్‌లో శిక్షణ తీసుకున్నామని అండర్ టెన్ విభాగంలో మొదటి బహుమతి అందుకోవడం సంతోషంగా ఉందని దానియా పాతిమా అన్నారు. ఈ కార్యక్రమంలో టీవీ5 ఛైర్మన్ బీఆర్‌ నాయుడు ,టీవీ 5 ఎండీ రవీంద్రనాథ్‌, ఏసీపీ ప్రభాకర్, సీఐ డీకే లక్ష్మీరెడ్డి, రాజేంద్రనగర్ ట్రాఫిక్ సీఐ, శ్యాంసుందర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత మాడి రాంరెడ్డి, క్లబ్ నిర్వహకులు పాల్గొన్నారు

Tags

Next Story