మరో వివాదంలో కోమటిరెడ్డి.. చెరుకు సుధాకర్‌ను చంపేస్తారంటూ వార్నింగ్‌

మరో వివాదంలో కోమటిరెడ్డి.. చెరుకు సుధాకర్‌ను చంపేస్తారంటూ వార్నింగ్‌
తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ కుమారుడు సుహాస్‌కు ఫోన్‌లో వార్నింగ్‌ ఇచ్చినట్లు ఆరోపణలు

కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ కుమారుడు సుహాస్‌కు ఫోన్‌లో వార్నింగ్‌ ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సుహాస్‌కు ఫోన్‌ చేసి బూతులు తిట్టారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చెరుకు సుధాకర్‌ తనకు వ్యతిరేకంగా మాట్లాడొద్దని హెచ్చరించారు. అంతేకాకుండా.. చెరుకు సుధాకర్‌ను చంపడానికి వంద వాహనాల్లో మనుషులు తిరుగుతున్నారని బెదిరించారు. చెరుకు సుధాకర్‌తో పాటు ఆయన కొడుకు సుహాస్‌ను కూడా చంపేస్తారని.. సుహాస్‌ నడుపుతున్న ఆస్పత్రి ఉండదని వార్నింగ్‌ ఇచ్చారు. కోమటిరెడ్డి బెదిరించిన ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags

Read MoreRead Less
Next Story