రాంకీటౌన్‌ షిప్‌ రిస్ట్రేజన్లు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

రాంకీటౌన్‌ షిప్‌ రిస్ట్రేజన్లు నిలిపివేస్తూ హైకోర్టు  మధ్యంతర ఉత్తర్వులు
X
సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ HMDA దాఖలు చేసిన అప్పీలుపై తెలంగాణ హైకోర్టు విచారణ

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం శ్రీనగర్‌ గ్రామంలో రాంకీటౌన్‌ షిప్‌లో రిస్ట్రేజన్లను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు. సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ HMDA దాఖలు చేసిన అప్పీలుపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. HMDA తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. బకాయిలు చెల్లించకుండా రిజిస్ట్రేషన్లకు రాంకీ ప్రయత్నిస్తుండడంతో నష్టం వాటిల్లుతుందని వాదించారు. దీనిపై రాంకీ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే.. ధర్మాసనం జోక్యం చేసుకుని కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. ఆ తర్వాతే విచారణ చేపడతామంటూ పేర్కొంది. రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

శ్రీనగర్‌లో టౌన్‌షిప్‌ అభివృద్ధికి ప్రభుత్వం HMDA ద్వారా రాంకీ గ్రూప్‌కు 750 ఎకరాల భూములు కేటాయించింది. తొలి దశలో 374 ఎకరాల అభివృద్ధికి HMDAతో రాంకీ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం డెవలప్‌మెంట్‌ ఛార్జీల కింద రాంకీ సంస్థ 100 కోట్లు చెల్లించాలి. కానీ కేవలం 25 కోట్లు మాత్రమే చెల్లించి ఫ్లాట్లు, విల్లాల విక్రయాలకు ప్రయత్నించింది. దీంతో రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది ప్రభుత్వం. దీనిపై కోర్టును ఆశ్రయించింది రాంకీ గ్రూపు. రిజిస్ట్రేషన్లనుకు అనుమతించాలని సింగిల్‌జడ్జ్‌ తీర్పు ఇచ్చారు. అయితే ఈ ఉత్తర్వులను సవాలు చేసింది HMDA. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టి హైకోర్టు రాంకీ టౌన్‌షిప్‌లో రిజిస్ట్రేషన్‌ నిలివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.

Tags

Next Story