కట్నం తక్కువైందని పెళ్లి రద్దు చేసుకున్న వధువు

కట్నం తక్కువైందని పెళ్లి రద్దు చేసుకున్న వధువు
కట్నం సరిపోలేదని వరుడు మొండికేయడం చూశాం, అలాగే ఎక్కువ కట్నం కోసం పెళ్లిల్లను మధ్యలో నిలిపేసి వరుడి బంధువులను చూశాం కానీ ఇక్కడ మాత్రం సీన్‌ రివర్స్‌ అయింది

కట్నం సరిపోలేదని వరుడు మొండికేయడం చూశాం, అలాగే ఎక్కువ కట్నం కోసం పెళ్లిల్లను మధ్యలో నిలిపేసి వరుడి బంధువులను చూశాం కానీ ఇక్కడ మాత్రం సీన్‌ రివర్స్‌ అయింది. తనకు ఇచ్చే కట్నం తక్కువైందని ఓ వధువు లగ్గాన్నే వదిలేసింది. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్‌ జిల్లా పోచారం గ్రామానికి చెందిన యువకుడికి ఖమ్మం జిల్లా అశ్వరావు పేటకు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. వధువుకు కట్నంగా రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని ఒప్పందమైంది. అయితే గురువారం పెళ్లి జరగాల్సింది ఉండగా తీరా లగ్గం సమయానకి వధువు, ఆమె బంధువర్గం ఎవరూ రాలేదు. అసలు విషయం ఏంటని వరుడి కుటుంబ సభ్యులు ఆరా తీయగా తమకు కట్నం సరిపోలేదని, ఎక్కువ కట్నం కావాలని డిమాండ్‌ చేసింది. దీంతో పెళ్లికొడుకు బంధువులు పోలీసులను ఆశ్రయించారు. వారు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా కూడా వధువు వినకపోవడంతో పెళ్లి అర్థాంతరంగా ఆగిపోవడమే కాక వరుడు ఇచ్చిన రెండు లక్షలు కూడా వదులుకున్నాడు.

Tags

Next Story