రాజ్‌భవన్ వద్ద ఉద్రిక్తత.. మేయర్, ఎమ్మెల్యే అరెస్ట్

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను శనివారం ఉదయం నుంచి ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో, హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. మహిళా దినోత్సవం రోజు ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజ్‌భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రాజ్‌భవన్ వద్దకు హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే గొంగిడి సునీతతో పాటు బీఆర్‌ఎస్ మహిళా కార్పోరేటర్లు చేరుకున్నారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. గవర్నర్ అపాయింట్‌మెంట్ లేదని వారిని వారించారు.
దీంతో మేయర్‌తో పాటు కార్పోరేటర్లు బైఠాయించారు. బండి సంజయ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉదయం నుంచి గవర్నర్ అపాయింట్‌మెంట్ ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసేంతవరకు వెళ్లేది లేదని స్పష్టం చేశారు. దీంతో పోలీసులు మేయర్ విజయలక్ష్మికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో నిరసన వ్యక్తం చేస్తున్న మేయర్, ఎమ్మెల్యే సునీత, బీఆర్‌ఎస్ మహిళా కార్పోరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com