ఎమ్మెల్సీ కవిత పుట్టిన రోజు.. అండమాన్ దీవుల్లో రెపరెపలాడిన అభిమానం

నేడు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు కావడంతో పార్టీశ్రేణులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు, అభిమానులు విషెస్ వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో కవితపై ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు కొందరు అభిమానులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్‌కు చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు చిన్ను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపి తన అభిమానాన్ని చాటుకున్నాడు. అండమాన్ నికోబార్ దీవుల్లోని బంగాళాఖాతం సముద్రపు అంచుల్లోకెళ్లి ఎమ్మెల్సీ కవిత బ్యానర్లు, హ్యాపీ బర్త్ డే కవితక్క అని ఉన్న గులాబి జెండాలను ప్రదర్శించారు.నీటి అడుగున డైవింగ్ చేయడం, బ్యానర్లు ప్రదర్శించడం ఆకర్షనగా నిలిచాయి. ఈ సన్నివేశాన్నంతా చిత్రీకరించారు. అయితే ఈ విడియోను టీస్ ఫుడ్ చైర్మెన్ మేడే రాజీవ్ సాగర్ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేశాడు. దీంతో ఆవీడియో కాస్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com