కాంగ్రెస్‌ ఎత్తిపోతల పథకాలే.. కేసీఆర్‌ తిప్పిపోతల పథకాలు: రేవంత్

కాంగ్రెస్‌ ఎత్తిపోతల పథకాలే.. కేసీఆర్‌ తిప్పిపోతల పథకాలు: రేవంత్
తాగు, సాగు నీటి అవసరాలను తీర్చేందుకు కాంగ్రెస్‌ హయాంలో జలయజ్ఙం తెస్తే కేసీఆర్‌ హయాంలో రీ డిజైన్‌ పేరుతో అంచనాలను పెంచి దోచుకుంటున్నారు

తాగు, సాగు నీటి అవసరాలను తీర్చేందుకు కాంగ్రెస్‌ హయాంలో జలయజ్ఙం తెస్తే కేసీఆర్‌ హయాంలో రీ డిజైన్‌ పేరుతో అంచనాలను పెంచి దోచుకుంటున్నారని టీపీసీసీ ఛీఫ్‌ రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. కమీషన్ల కోసమే డిజైన్లు మారుస్తున్నారని కాంగ్రెస్‌ ఎత్తిపోతల పథకాలని కేసీఆర్‌ తిప్పిపోతల పథకాలుగా మార్చారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ దోపిడీకి ప్రాణహిత, చేవెళ్ళ ప్రాజెక్ట్‌ బలైందని, సిరిసిల్లలో తొమ్మిదొవ ప్యాకేజీ పనులు ఆపేశారని రేంవంత్‌ విమర్శించారు. కేసీఆర్‌ స్వార్థానికి తెలంగాణ ప్రాజెక్టులు బలైతున్నాయన్నారు. 300 కొట్ల వ్యయాన్ని 3000 కొట్లకు పెంచి ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు. పాత డిజైన్ల ప్రకారమే పనులు పూర్తి చేయాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలోకి వస్తే ఎవరికీ నష్టం వాటిల్లకుండా పెండింగ్‌ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

Tags

Next Story