కేంద్రం బరితెగించింది.. ఎలాంటి దాడులనైనా కేసీఆర్ ఎదుర్కొంటాడు: శ్రీనివాస్ గౌడ్
లక్షల కోట్లు దోచుకున్నవాళ్లను మాత్రం పట్టించుకోవడంలేదు

కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకే ఈ దాడులు చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. లక్షల కోట్లు దోచుకున్నవాళ్లను మాత్రం పట్టించుకోవడంలేదన్నారు. ప్రశ్నించే వారినే టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం బరితెగించి వ్యవహరిస్తోందని మంత్రి పేర్కొన్నారు. కేంద్రంపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత వస్తోందన్నారు. కేంద్రాన్ని ఎదుర్కొనే శక్తి కేసీఆర్‌కు ఉందన్నారు. ఎవరి మీద కేసులు పెట్టినా కేసీఆర్ భయపడే వ్యక్తి కాదని మంత్రి శ్రీనివాస్ తెలిపారు. న్యాయపరంగా అన్ని శక్తులను ఎదుర్కుంటామని కోట్లాది మంది ప్రజలు బీఆర్‌ఎస్ వైపు ఉన్నారన్నారు. ఎలాంటి దాడులనైనా ఎదురుకునే శక్తి కేసీఆర్‌కు ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
Next Story