సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి

హైదరాబాద్ సికింద్రాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్వప్నలోక్ షాపింగ్ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి 8 గంటప ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకుంది. 5,6 ఫ్లోర్లో దట్టమైన పొగలు అలుముకోవడంతో సెర్చ్ ఆపరేషన్‌కు సవాలుగా మారింది. అప్పటినుంచి ప్రయత్నం చేస్తున్నా పొగలా ఏమాత్రం అదుపులోకి రాలేదు. బాత్రూంలో చిక్కుకోవడంతో ఆరుగురు మృతి చెందినట్లు అధికారులు తెలుపుతున్నారు. మంటలు చెలరేగడంతో బాత్‌రూంలోకి వెళ్లిన ఆరుగురు పొగచుట్టుముట్టడంతో ఊపిరాడక అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు ప్రమీల(22), శివ(22), త్రివేణి(22), వెన్నెల(22), ప్రశాంత్(23), శ్రావణి లుగా గుర్తించారు. వీరి మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు అధికారులు. మృతులంతా ఈ కామర్స్ కంపెనీకి చెందిన ఉద్యోగులు. ఆసుపత్రి వద్ద మృతుల కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటుతున్నాయి. పురాతన షాపింగ్ కాంప్లెక్స్‌గా స్వప్న లోక్ కు పేరుంది. అయితే ఈ కాంప్లెక్స్‌లో దాదాపు 400ల షాపులు ఉన్నాయి. కాంప్లెక్స్ యజమానులు ఫైర్ సేఫ్టీని ఏమాత్రం పాటించలేదు. గతంలో కూడా ఈ షాపింగ్ కాంప్లెక్స్ పెచ్చులు ఊడి ఒకరు మృతి చెందారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com