విశ్వనగరమని కేటీఆర్ గొప్పలు.. కరువైన కనీస భద్రత: రేవంత్
స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాద ఘటనపై టీపీసీసీ రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి
స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాద ఘటనపై టీపీసీసీ రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న ఆరుగురు యువతి,యువకులు మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. డెక్కెన్ మాల్ ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుందన్నారు. వరుసు ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదని విమర్శించారు. విశ్వనగరం అంటూ మంత్రి కేటీఆర్ గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు కనీస భద్రత కల్పించడంలేదన్నారు. మరోవైపు అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయన్నాయని రేవంత్ పేర్కొన్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.