తెలంగాణలో భారీ వర్షాలు.. విద్యుత్‌ వైర్లు తెగి ఒకరు మృతి

తెలంగాణలో భారీ వర్షాలు.. విద్యుత్‌ వైర్లు తెగి ఒకరు మృతి
ఉపరితల ద్రోణిప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈదురు గాలులు, వడగళ్లు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు

ఉపరితల ద్రోణిప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈదురు గాలులు, వడగళ్లు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఒక్కసారిగా వాతవరణంలో మార్పు వచ్చి చల్లబడింది. దీంతో పలు చోట్ల వడగళ్ల వాన కురిసింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు వర్షం పడింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి సికింద్రాబాద్‌లో హైటెన్షన్ వైర్లు తెగాయి. దీంతో రోడ్డుపై వెళుతున్న ప్రదీప్‌ అనే వ్యక్తి మరణించాడు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు ఉంటాయని ఈ మేరకు రాష్ట్రప్రజలను అప్రమత్తం చేసింది. కొన్ని జిల్లాల్లో ఎల్లో అలెర్ట్‌ కూడా ప్రకటించింది.

Tags

Next Story