పోర్న్ స్టార్‌తో ట్రంప్‌కు సంబంధం?.. అరెస్ట్ చేస్తే ఆందోళనలు చేయండి

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కేసును ఎదుర్కొంటున్నారు. మంగళవారం ఆయనను అదుపులోకి తీసుకోవచ్చునని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ఒకవేళ ఆ పరిస్థితులు వస్తే అండగా ఉండాలని మద్దతుదారులకు పిలుపునిచ్చారు. ట్రంప్ 2016 ఎన్నికల్లో పోటీ చేసి ఘణవిజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రముఖ అమెరికన్ టాప్ పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్‌తో తనకున్న సంబంధాలు బయట పడకుండా తన అడ్వకేట్‌ను మధ్యవర్తిగా పెట్టి పెద్ద మొత్తంలో ఆమెకు డబ్బు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. అయితే 2006లో ట్రంప్ తనతో సెక్స్ చేశారని స్టార్మీ ఆరోపించారు. ఎలక్షన్ సమయంలో ఆ విషయాన్ని బయట పెట్టొద్దని బెదిరించాడని ఆరోపించారు. ట్రంప్ తన అడ్వకేట్ ద్వారా 1.30 లక్షల డాలర్లు తనకు ఇచ్చారని స్పష్టం చేశారు. కాగా పోర్న్ స్టార్ విషయంలో తాను ఏ తప్పు చేయలేదని ట్రంప్ వాదిస్తున్నారు. అయినా ఈ కేసులో తనపై నేరం రుజువైనా కూడా ఎన్నికల భరిలో నిలుచుంటానని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ట్రంప్ అడ్వకేట్ మాత్రం ఈ విషయాన్ని తోసిపుచ్చారు. ట్రంప్‌ను అదుపులోకి తీసుకోవడానికి అధికారికంగా ఎలాంటి ఆత్తర్వులు జారీ కాలేదని పేర్కొంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com