పర్సనల్‌ డేటా చోరీకి పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు

పర్సనల్‌ డేటా చోరీకి పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు
కోట్లాది మంది భారతీయుల డేటాను చోరీ చేసి విక్రయిస్తున్న సైబర్‌ నేరగాళ్లు

పర్సనల్‌ డేటా చోరీకి పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టైంది. కోట్లాది మంది భారతీయుల డేటాను చోరీ చేసి విక్రయిస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు. అయితే వారిపై నిఘా పెట్టిన పోలీసులు దేశవ్యాప్తంగా అరెస్టులు చేస్తున్నారు. సైబరాబాద్‌ పరిధిలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు సైబరాబాద్‌ పోలీసులు. వీరిని నాగ్‌పూర్‌, ఢిల్లీ, ముంబైకి చెందిన ముఠాగా గుర్తించారు. ఈ విషయం పట్ల రెండు రోజులుగా సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అయితే పర్సనల్‌ డేటా, గ్యాస్‌ ఏజెన్సీ డేటా చోరీ అయింది. అలాగే స్త్రీల డేటా కూడా చోరీకి గురైందని తెలిపారు. బిల్లు చెల్లించలేదని ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లు చేస్తూ నేరాలకు పాల్పడుతున్నారు. నిందితులు ముందుగా జస్ట్‌ డయల్‌ ద్వారా ఏజెంట్ల నెంబర్స్‌ తెలుసుకొని వారి నుంచి డేటాను కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story