రాహుల్‌కు అండగా తెలంగాణ కాంగ్రెస్‌ ఆందోళన బాట

రాహుల్‌కు అండగా తెలంగాణ కాంగ్రెస్‌ ఆందోళన బాట
నిరసనలతో హోరెత్తించేందుకు సిద్ధం

రాహుల్‌ గాంధీకి అండగా తెలంగాణ కాంగ్రెస్‌ ఆందోళన బాట పట్టింది. ఆదివారం టీపీసీసీ ఛీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఆద్వర్యంలో గాంధీభవన్‌లో నిరసన దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్ష సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ దీక్షకు ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష అని నామకరణం చేశారు. రాహుల్‌ పై అనర్హత వేటు వెనక ఉన్న రాజకీయ కోనాన్ని ప్రజలకు వివరించ నున్నట్లు కాంగ్రేస్‌ నేతలు తెలుపుతున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు జిల్లా స్థాయిలో భారీ నిరసనలు చేపట్టనున్నారు. అదానీ అక్రమాలను ప్రశ్నించినందుకే రాహుల్‌ గాంధీపై వేటు వేశారన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అన్ని రాకాల పోరాటాలకు సిద్ధమయ్యారు.

రాహుల్‌ఫై అనర్హత వేటుపై వ్యతిరేకంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికే చర్చించారు. కర్ణాటక నుంచి హైదరాబాద్‌ మీదుగా ఢీల్లీ వెళ్లిన ఖర్గే శంశాబాద్‌ ఏయిర్‌పోర్టులో రేవంత్‌తో సహా పలువురు సీనియర్‌ నేతలతో చర్చించారు. టీ కాంగ్రెస్‌ నిరసన కార్యక్రమాలకు ఆమోదం తెలిపారు. అధిస్టానం నుంచి సిగ్నల్‌ రావడంతో నిరసనలతో హోరెత్తించేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు సిద్ధమయ్యారు. ఇవాళ గాంధీ భవన్‌లో నిరసన దీక్ష చేపట్టనున్న కాంగ్రెస్‌ నేతలు రేపు ట్యాంక్‌ బండ్‌పై భారీ ర్యాలీ చేపట్టాలని యోచిస్తున్నారు. ఇక మంగళ వారం అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.

Tags

Next Story