గుడికి రానివ్వడంలేదని మనస్థాపంతో పురుగుల మందు తాగాడు

గుడికి రానివ్వడంలేదని మనస్థాపంతో పురుగుల మందు తాగాడు
సాయిబాబా గుడిలోకి రానివ్వడంలేదని మోహన్‌ తీవ్ర మనస్థాపం

భద్రాద్రి జిల్లా ఇల్లందులో మోహన్‌ పాసీ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. సాయిబాబా గుడిలోకి రానివ్వడంలేదని మోహన్‌ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. పందుల పెంపకం, వాటి మాంసం విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే వాటి మూలంగా ఆలయంలోకి రావద్దన్నారని ఆలయ కమిటీపై ఆరోపణలు చేశాడు. గతంలో సాయిబాబా గుడికి మోహన్‌ పాసి స్థలం కూడా దానం చేశాడు.

Tags

Next Story