తెలంగాణను చూసి ఇతర రాష్ట్రాలు నేర్చుకుంటున్నాయి: కేటీఆర్‌

తెలంగాణను చూసి ఇతర రాష్ట్రాలు నేర్చుకుంటున్నాయి: కేటీఆర్‌
X
జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనపరచిన 27 గ్రామ పంచాయతీలకు అవార్డులు ప్రధానం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్‌ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా తెలంగాణను చూసి ఇతర రాష్ట్రాలు నేర్చుకుంటున్నాయన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ పంచాయతీ ఆవార్డుల కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనపరచిన 27 గ్రామ పంచాయతీలకు అవార్డులు ప్రధానం చేశారు కేటీఆర్‌. అంతకు ముందు ఎల్లారెడ్డిపేట మండలం పదిరలో దళిత బంధు పథకంలో భాగంగా మంజూరైన రైస్ మిల్‎ని మంత్రి ప్రారంభించారు. అనంతరం రైస్ మిల్ యూనిట్ స్థాపన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైస్‌మిల్‌ను స్థాపించాలనుకోవడం గొప్పనిర్ణయమని రైస్‌మిల్‌ యూనిట్‌ విజయవంతంగా నడవాలని రాష్ట్రం మొత్తానికి ఇది ఆదర్శంగా నిలవాలని చెప్పారు. మిగతా లబ్దిదారులకు కేస్‌ స్టడీగా మారాలని కేటీఆర్‌ అన్నారు.

Tags

Next Story