నవాబుల కాలం నాటి కోట..గుప్త నిధుల కోసం తవ్వకాలు ఏమైందంటే

నవాబుల కాలం నాటి  కోట..గుప్త నిధుల కోసం తవ్వకాలు ఏమైందంటే
కోట బురుజుకు అనుకొని ఇల్లు ఉండడంతో గుప్త నిధులు ఉన్నాయని ఇంటి యజమానులు ఓ ముఠాతో కలిసి తవ్వకాలు

హైదరాబాద్ రాజేంద్రనగర్‌ పరిధిలోని బుద్వేల్‌లో గుప్తనిధుల కోసం తవ్వకాలు కలకలం రేపాయి. నిజాం నవాబుల కాలం నాటి పురాతన కోట బురుజు వద్ద ఓ ఇంట్లో గుప్తు నిధుల కోసం తవ్వకాలు జరిపారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 9 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి మూడు కార్లతో పాటు 16 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

కోట బురుజుకు ఆనుకొని వినోద్, నాగులు అనే ఇద్దరు వ్యక్తులకు చెందిన ఓ ఇల్లు ఉంది. అయితే పురాతన కోట బురుజుకు అనుకొని ఇల్లు ఉండడంతో గుప్త నిధులు ఉన్నాయని ఇంటి యజమానులు ఓ ముఠాతో కలిసి తవ్వకాలు జరిపారు. గత రెండు రోజులుగా రెక్కీ నిర్వహించి తవ్వకాలకు స్కెచ్ వేసినట్లు పోలీసులు గుర్తించారు. రెండు చోట్ల లోతైన గోతులు తవ్వినట్లు పోలీసులు గుర్తించారు. అయితే నిందితులు తవ్వకాలు జరుపుతుండగా శబ్దాలు రావడంతో స్థానికులు పోలీసులుకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన ఎస్ఓటి టీమ్స్, రాజేంద్రనగర్ పోలీసులు ఆ ఇంటి పై దాడి చేసి తవ్వకాలు జరుపుతున్న ముఠాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రాజేంద్రనగర్ పీఎస్ కు తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story