భద్రాద్రి సీతారాముల వారి కళ్యాణానికి సర్వం సిద్ధం

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి.. శ్రీరామ నవమి వేడుకలకు సిద్ధమైంది. సీతారామచంద్రస్వామి కళ్యాణానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. రేపు అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణం జరగనుంది. దీనికోసం ఆలయ సమీపంలోని మిథిలా స్టేడియంలో మండపం సిద్ధం చేశారు. ఇక ఎల్లుండి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించానున్నారు. దీంతో భద్రాద్రిలో ఎటుచూసినా స్వాగత తోరణాలు, చలువ పందిళ్లతో కల్యాణ వైభవం కనిపిస్తోంది. రాములోరి కల్యాణ వేడుకను కనులారా వీక్షించేందుకు.. దాదాపు లక్ష మందికి పైగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా మిథిలా ప్రాంగణానికి చేరుకునేలా సమాచార శాఖ రూట్ మ్యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పార్కింగ్ స్థలాలను గుర్తించేలా ఏర్పాట్లు చేసింది.
సీతారాముల కల్యాణం జరిగే మిథిలా స్టేడియం నుంచి 15వేల మందిఉచితంగా రాములోరి కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంది. స్టేడియాన్ని 26 సెక్టార్లుగా విభజించిన అధికారులు.. ప్రతి సెక్టార్‌కి ఓ ప్రభుత్వ అధికారిని పర్యవేక్షణకు నియమించినట్లు ఆలయ EO తెలిపారు. 2వేల మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్నారు. మరోవైపు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, తినుబండారాలను ఏర్పాట్లు చేశారు. LED స్క్రీన్ ద్వారా కల్యాణ మహోత్సవం తిలకించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు EO తెలిపారు. ఇక ఉత్సవాలకు హాజరయ్యే భక్తులు ముందుగానే ఆన్‌లైన్‌లో బక్ చేసుకునేలా రూములు, కల్యాణం టికెట్లను నెల రోజల క్రితం నుంచే అందుబాటో ఉంచామన్నారు.
భక్తుల కోసం రెండు లక్షల లడ్డూ ప్రసాదాలు, రెండు లక్షలకు పైగా తలంబ్రాల ప్యాకెట్లు సిద్ధం చేసినట్లు తెలిపారు. వీటికోసం 19 లడ్డూ కౌంటర్లు, 70కి పైగా తలంబ్రాల కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఉత్సావాలకు హాజరు కాలేని భక్తులకు సైతం తలంబ్రాలు, ప్రసాదాలు అందే విధంగా పోస్టల్, ఆర్టీసీ కార్గో ద్వారా అందిస్తునట్లు వివరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com