హైదరాబాద్‌లో వైభవంగా హనుమాన్‌ శోభాయాత్ర

హైదరాబాద్‌లో  వైభవంగా హనుమాన్‌ శోభాయాత్ర
X

హైదరాబాద్‌లో హనుమాన్‌ శోభాయాత్ర వైభవంగా జరుగుతోంది. గురువారం ఉదయం సీతారాంబాగ్‌ నుంచి మొదలైన యాత్ర.. కొద్దిసేపటి క్రితం ధూల్‌పేట గాంధీ విగ్రహం దగ్గరకు చేరుకుంది. దారి పొడవునా భక్తులు జైశ్రీరాం నినాదాలతో హోరెత్తిస్తున్నారు. హనుమాన్‌ శోభాయాత్ర సీతారాంబాగ్ నుంచి బోయగూడ కమాన్, బేగంబజార్, సిద్ధంబర్​ బజార్, పుత్లిబౌలి, బడిచౌడి మీదుగా హనుమాన్ వ్యాయామశాలకు చేరుతుంది. అంబర్​పేట్​, ఫిలింనగర్ నుంచి మరికొన్ని శోభాయాత్రలు హనుమాన్‌ వ్యాయామశాలకు రానున్నాయి. ఆకాశ్ పురి నుంచి మరో శోభాయాత్ర ధూల్​పేట్ ​దగ్గర కలుస్తుందని, శాంతియుతంగా శోభాయాత్ర నిర్వహిస్తున్నామని భాగ్యనగర్ ​ఉత్సవ సమితి తెలిపింది. శోభాయాత్రకు వచ్చే భక్తులకు దారి పొడవునా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. యాత్రలో భాగంగా శ్రీరాముని వేషధారణతో పాటు స్వతంత్ర సమరయోధుల వేషధారణలో పలువురు కనిపిస్తున్నారు. శోభాయాత్రకు ముఖ్య అతిథులుగా కాశీ నుంచి సుమేరు పీఠాధిపతి శంకరాచార్య స్వామి, నరేంద్ర నంద సరస్వతి, రాజస్థాన్ నుంచి క్రాంతికారి శ్రీసంత్ భోమా రాంజీ హాజరయ్యారు.

Next Story