టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో మలుపు.. రంగంలోకి ఈడీ

TSPSC ప్రశ్నపత్రాల లీకేజీ కేసు మరో మలుపు తిరగనుంది. లక్షల్లో డబ్బు చేతులు మారినట్లు ఇప్పటికే సిట్ దర్యాప్తులో వెల్లడి కావడంతో త్వరలోనే ఈడీ రంగంలోకి దిగబోతున్నట్లు సమాచారం. కేసు నమోదుకు ఈడీ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే 15 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చే శారు. వారిలో కొందరిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రధానంగా గ్రూప్-1 పరీక్షలో వంద మార్కులకు పైగా సాధించిన అభ్యర్థులనూ విచారిస్తున్నారు. ఈ వ్యవహా రంపై నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా నిధుల మళ్లింపునకు సంబంధించి ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టబోతోంది. సైబరాబాద్ పోలీసులు చేధించినా డేటా లీకే జీ పైనా ప్రత్యేకంగా మరో కేసు నమోదు చేసింది. ప్రశ్నపత్రాల లీకేజీపై రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో తాజా పరిణామం చోటు చేసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com