ఎమ్మెల్యే రాజా సింగ్‌పై మరో కేసు

X
By - Subba Reddy |31 March 2023 10:15 AM IST
మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై IPC సెక్షన్ 153-A కింద కేసు
గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై మరో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై IPC సెక్షన్ 153-A కింద కేసు చేశారు ముంబై పోలీసులు.గత జనవరి 29న ముంబైలోని హిందూ సకల్ సమాజ్ మోర్చాలో ద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు రాజా సింగ్‌పై గ్రేటర్ ముంబై పోలీసులు దాదర్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశారు.రెండు వర్గాల మధ్య శతృత్వాన్ని పెంపొందించేలా లేదా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి మత సామరస్యానికి విఘాతం కలిగించారని ఆరోపణలతో కేసు నమోదు చేశారు.మైనారిటీ కమ్యూనిటీ సభ్యులు నిర్వహించే షాపుల నుండి ఎలాంటి వస్తువులను కొనుగోలు చేయడాన్ని బహిష్కరించాలని నేను ప్రతి హిందువును కోరుతున్నానని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com