నిజామాబాద్‌లో మెడికో ఆత్మహత్య

నిజామాబాద్‌లో మెడికో ఆత్మహత్య
సనత్ అనే మెడికల్ కళాశాల విద్యార్థి హాస్టల్‌ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య

నిజామాబాద్‌లో వరుసగా మెడికోల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. సనత్ అనే మెడికల్ కళాశాల విద్యార్థి హాస్టల్‌ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు సనత్ ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. మెడికో సనత్ స్వస్థలం పెద్దపల్లిగా తెలుస్తోంది. ఇక ఇటీవలే కాలంలో ఓ మెడికో ఆత్మహత్య చేసుకున్నాడు. వరుస ఘటనల నేపథ్యంలో అసలెం జరుగుతుందనే ఆందోళన నెలకొంది.

సనత్ ఆత్మహత్య కలిచివేసిందని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఇందిర అన్నారు. అందరితో బాగా మాట్లాడతాడని చెప్పారు. రాత్రి వరకు తోటి విద్యార్థులతో కలిసి చదువుకున్నాడని.. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో అర్థం కావడం లేదన్నారు. ఇక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామన్న ప్రిన్సిపాల్ ఆత్మహత్యపై విచారణ కొనసాగుతుందన్నారు.

Tags

Next Story