వరల్డ్‌ బాక్సింగ్ ఛాంపియన్‌కు మంత్రి శ్రీనివాస్‌ స్వాగతం

వరల్డ్‌ బాక్సింగ్ ఛాంపియన్‌కు మంత్రి శ్రీనివాస్‌ స్వాగతం
X
బాక్సర్ నిఖత్ జరీన్ తెలుగు జాతి ఖ్యాతిని మరింత పెంచారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు

బాక్సర్ నిఖత్ జరీన్ తెలుగు జాతి ఖ్యాతిని మరింత పెంచారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఉమెన్స్‌ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌ షిప్‌లో గోల్డ్‌ మెడిల్ సాధించిన నిఖత్ జరీన్‌కు శంషాబాద్‌లో స్వాగతం పలికిన శ్రీనివాస్‌ గౌడ్.. శాలువాతో సన్మానించారు. ఇప్పటికే ఎన్నో ఘనతలు సాధించిన నిఖత్.. తాజాగా వరల్డ్ ఛాంపియన్‌ షిప్‌లో కూడా సత్తా చాటడం సంతోషకరమన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. క్రీడాకారులకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు క్రీడాశాఖకు చెందిన పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు.

Tags

Next Story