వైఎస్ షర్మిల ఫోన్ చేసింది వాస్తవమే: బండి

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఫోన్ చేయడం తెలంగాణలో ఆసక్తికరంగా మారింది. ఇదే విషయాన్ని తెలంగాణ బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. షర్మిలా ఫోన్ చేసింది వాస్తవమన్నారు. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై పోరాటంలో కాంగ్రెస్ వస్తే తాము కలవమని స్పష్టంగా చెప్పామని తెలిపారు. గతంలో షర్మిలపై దాడిని ఖండించామని.. భవిష్యత్తులోను కేసీఆర్ అరాచకాలకు వ్యతిరేకంగా కలిసి పనిచేస్తామని బండి సంజయ్ తేల్చిచెప్పారు.
అటు కాళేశ్వరం సహా బీఆర్ఎస్ పథకాల అమలు తీరుపైనా బండి సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లకు ఎలా వెళ్లిందో కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. పంటలు మునిగి రైతులు ఎంత నష్టపోయారు? అదనంగా ఎన్ని ఎకరాలకు కరెంట్ ఇస్తున్నారు? ఉచిత విద్యుత్ రాష్ట్రంలో ఎక్కడ ఇస్తున్నారో ముఖ్యమంత్రి చూపించాలని బండి సంజయ్ సవాల్ విసిరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com