సంచలనం రేపుతున్న డేటా చోరీ కేసు.. మరో నిందితుడి అరెస్ట్‌

సంచలనం రేపుతున్న డేటా చోరీ కేసు.. మరో నిందితుడి అరెస్ట్‌
ఫరీదాబాద్‌కు చెందిన వినయ్‌ భరద్వాజ అరెస్ట్, నిందితుని వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లు, రెండు ల్యాప్‌ టాప్‌లు స్వాధీనం

దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న వ్యక్తిగత డేటా చోరీ కేసులో సిట్‌ దూకుడు పెంచింది. డేటా చోరీ కేసులో మరొక నిందితుడిని సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. హరియాణాలోని ఫరీదాబాద్‌కు చెందిన వినయ్‌ భరద్వాజను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతని వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లు, రెండు ల్యాప్‌ టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్‌టాప్‌లో 66.9కోట్ల మందికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు ఉన్నట్లు గుర్తించారు. విద్యార్థులు, ప్రభుత్వం, ప్రైవేట్‌ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల వివరాలను నిందితుడు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

జీఎస్టీ, పాన్‌ కార్డు, అమెజాన్‌, నెట్‌ ప్లిక్స్‌ యూట్యూబ్‌, ఫోన్ పే, బిగ్‌ బాస్కెట్‌, ఇన్‌స్టాగ్రామ్‌, బుక్‌ మై షో, ఆప్‌ స్టాక్స్‌ సంస్థల నుంచి బైజూస్‌ నుంచి 9, 10, 11,12 తరగతులకు చెందిన విద్యార్థుల డేటాను నిందితుడు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. మొత్తం 24 రాష్ట్రాలు, 8 మెట్రో పాలిటన్‌ సిటీల నుంచి వినయ్‌ భరద్వాజ డేటా చోరీ చేసినట్టు పోలీసులు గుర్తించారు.

Tags

Next Story