నియంత పాలనలో తొమ్మిదేళ్లుగా అన్యాయమే: షర్మిల

నియంత పాలనలో తొమ్మిదేళ్లుగా అన్యాయమే: షర్మిల

సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. నియంత పాలనలో నిరుద్యోగులకు తొమ్మిదేళ్లుగా అన్యాయమే జరుగుతోందన్నారు. తెలంగాణ బిడ్డల భవిష్యత్తు కోసం రాజకీయాలకు అతీతంగా, వ్యక్తిగత అజెండాలు పక్కనపెట్టి, పోరాడాల్సిన అవసరం ఉందని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. ఇందు కోసం టీ- సేవ్ అనే ఫోరాన్ని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగుల భవిష్యత్తు కోసం జెండాలు వేరైనా ఒకే అజెండాగా పనిచేద్దామన్నారు ఏప్రిల్ 10వ తేదీన సమావేశమై ఉమ్మడి కార్యాచరణను రూపొందిద్దామని చెప్పారు.

Next Story