హనుమాన్‌ శోభాయాత్రకు నగరవాసులు సహకరించాలి: సీపీ సుధీర్‌బాబు

హనుమాన్‌ శోభాయాత్రకు నగరవాసులు సహకరించాలి: సీపీ సుధీర్‌బాబు
X

నేడు హనుమాన్‌ జయంతి. ఈ నేపథ్యంలో హనుమాన్‌ శోభాయాత్ర సవ్యంగా సాగేందుకు హైదరాబాద్‌ నగరవాసులు సహకరించాలని సీపీ సుధీర్‌ బాబు విజ్ఞప్తి చేశారు. శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్‌ డైవర్షన్స్ ఉంటాయని, వాహనదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. ఉదయం 11 గంటలకు గౌలిగూడలోని రామ మందిరం నుంచి శోభాయాత్ర ప్రారంభ మవుతుందన్నా రు. మధ్యాహ్నం 12.30కి యాత్ర కోటి ఆంధ్ర బ్యాంక్‌ సర్కిల్‌ వరకు చేరుకుంటుందన్నారు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ మీదుగా హనుమాన్‌ శోభాయాత్ర రాత్రి 8 గంటలకు తాడ్‌ బండ్‌ హనుమాన్‌ దేవాలయం చేరుకుంటుందన్నారు. శోభాయాత్రలో 750 మంది ట్రాఫిక్‌ సిబ్బంది విధుల్లో ఉంటారని చెప్పారు.

Tags

Next Story