తెలంగాణ పెండింగ్ బిల్లుల ఆమోదం పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ

సుప్రీం కోర్టులో తెలంగాణ పెండింగ్ బిల్లుల ఆమోదం పిటిషన్‌పై ఈరోజు(సోమవారం) విచారణ జరగనుంది. గవర్నర్ వద్ద పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. చట్ట సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర వేసేలా ఆదేశాలివ్వాలంటూ.. ప్రభుత్వం తరపున సీఎస్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిని చేర్చారు. బిల్లుల ఆమోదాన్ని ఆలస్యం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తి.. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధమని ప్రభుత్వం పేర్కంది.
విషయ తీవ్రత, ప్రాధాన్యత దృష్ట్యా విధి లేకే సుప్రీం కోర్టును ఆశ్రయించామని తెలిపింది. గవర్నర్ వద్ద 10 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొంది. అటు సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరపనుండగా.. మూడు బిల్లులకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. మరో రెండు బిల్లులను ప్రభుత్వానికి తిప్పిపంపారు. మరో రెండు బిల్లులు రాష్ట్రపతికి పంపిన తమిళిసై.. రెండు బిల్లులు పెండింగ్‌లో పెట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com