బిల్లులను పెండింగ్లో పెట్టడం దారుణం: మంత్రి హరీష్‌

బిల్లులను పెండింగ్లో పెట్టడం దారుణం: మంత్రి హరీష్‌
X

గవర్నర్ బిల్లులను పెండింగ్లో పెట్టడం దారుణమన్నారు మంత్రి హరీష్. కోర్టులో కేసులు వేస్తే కాని బిల్లులు పాస్ కాని పరిస్థితి ఏర్పడిందన్నారు. మంత్రులు కలిసినా గవర్నర్ బిల్లులను ఆమోదించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వ్యవస్థలను బీజేపీ ఆదీనంలో పెట్టుకుంటుందంటూ మండిపడ్డారు. ఫారెస్ట్ యూనివర్శిటీ పెట్టుకుంటే బీజేపీకి వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు. ఈ బిల్లును గవర్నర్ ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపారంటూ ఫైర్ అయ్యారు. ఇది రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడమేనన్న ఆయన...పిల్లల భవిష్యతు కంటే రాజకీయాలు మీకు ముఖ్యమా? అంటూ ప్రశ్నించారు.

Tags

Next Story