సీపీ రంగనాథ్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు: బండి

సీపీ రంగనాథ్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు: బండి
పోలీసులే తన ఫోన్‌ను దొంగిలించారని ఆరోపించారు

కేసీఆర్‌కు మానవ సంబంధాలు కాదు.. మనీ సంబంధాలే ముఖ్యమన్నారు బీజేపీ చీఫ్ బండి సంజయ్. పోలీసులే తన ఫోన్‌ను దొంగిలించారని ఆరోపించారు. వరంగల్‌ సీపీ రంగనాథ్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన విజయవాడ, ఖమ్మం, వరంగల్‌లో ఏమేమి దందాలు చేసాడో తెలుసన్నారు. అన్ని బయటకి తీసుకొస్తామన్నారు. దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు. వరంగల్ సీపీపై పరువు నష్టం దావా వేస్తానన్న బండి సీఎం కేసీఆర్ పై విరుచుకు పడ్డారు. విశాఖ సంగతి తర్వాత ముందు బయ్యారం సంగతి తేల్చాలంటూ డిమాండ్ చేశారు. ఈ నెల 15న వరంగల్ లో నిరుద్యోగ మార్చ్ జరిపితీరుతామన్నారు.

Tags

Next Story