అగ్గిపెట్టెలో అమ్మవారికి చీరను సమర్పించిన సిరిసిల్ల నేతన్న

అగ్గిపెట్టెలో అమ్మవారికి చీరను సమర్పించిన సిరిసిల్ల నేతన్న
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు అగ్గిపెట్టెలో పట్టే చీరను సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు సమర్పించాడు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు అగ్గిపెట్టెలో పట్టే చీరను సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు నల్లా విజయ్‌ సమర్పించాడు. ఈ పట్టు చీర తయారీలో ఐదు గ్రాముల బంగారం, 10గ్రాముల వెండిని వినియోగించినట్లు విజయ్‌ తెలిపారు. ఐదుగురు చేనేత కార్మికులు 25 రోజుల పాటు శ్రమించి చీరను తయారు చేసినట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగు ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు ఆయన పేర్కొన్నాడు.

Tags

Read MoreRead Less
Next Story