గవర్నర్లు కేంద్రం చేతిలో పావులుగా మారడం దురదృష్టకరం: మంత్రి కేటీఆర్

X
By - Subba Reddy |11 April 2023 12:15 PM IST
గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వం పంపే బిల్లులను క్లియర్ చేసేందుకు గవర్నర్లకు నిర్ణీత గడువు పెట్టాలంటూ తమిళనాడు
గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వం పంపే బిల్లులను క్లియర్ చేసేందుకు గవర్నర్లకు నిర్ణీత గడువు పెట్టాలంటూ తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానానికి మద్దతుగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. గవర్నర్ వంటి రాజ్యాంగ పదవులు ఇపుడు కేంద్ర ప్రభుత్వం చేతిలో పావులుగా మారడం దురదృష్టకరమని ఆయన ట్వీట్ చేశారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో ఇలాంటి గవర్నర్లతో పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు.ఆయా రాష్ట్రాల్లో గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించకపోగా... ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. టీమ్ స్పిరిట్, సహకార సమైక్య ఫెడరలిజం స్ఫూర్తి అంటే ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి వైఖరి దేశాభివృద్ధికి ఉపకరిస్తుందా అని కేటీఆర్ నిలదీశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com