ఖమ్మం జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం.. ఏరియల్ బాంబింగ్ సిగ్గుచేటు

ఖమ్మం జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం.. ఏరియల్ బాంబింగ్ సిగ్గుచేటు
ఖమ్మం జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం రేపింది. సీపీఐ మావోయిస్టు పార్టీ కార్యదర్శి ఆజాద్ పేరుతో లేఖ విడుదల

ఖమ్మం జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం రేపింది. సీపీఐ మావోయిస్టు పార్టీ కార్యదర్శి ఆజాద్ పేరుతో లేఖ విడుదల చేశారు. పలు అంశాలతో కూడిన రెండు పేజీల లేఖలో కేంద్రాన్ని హెచ్చరించారు. ఆదివాసీ గ్రామాలపై ఏరియల్ బాంబింగ్ సిగ్గుచేటని మావోయిస్టులు ఫైర్ అయ్యారు. మైనింగ్ కోసమే ఆదివాసీలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. బహుళజాతి కంపెనీలకు బస్తర్‌ను కట్టబెట్టేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కంకణం కట్టుకున్నారని లేఖలో మండిపడ్డారు. మావోయిస్టు పార్టీని అంతమొందించే లక్ష్యంతో.. ఆదివాసీలపై జరుగుతున్న సమాధాన్ ప్రహార్ దాడులను ఖండించాలన్నారు. దేశ ప్రజలపై వైమానిక దాడులు చేయడం హేయమైన చర్య అన్న మావోయిస్టులు.. దేశ ప్రజలు మేల్కోవాలని తెలిపారు. గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా.. దేశ సంపదను కాపాడుకునేందుకు పోరాటాలు చేయాలన్నారు. వీటితో పాటు దండకారణ్యంలో ఏర్పాటు చేసిన సైన్యాన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని మావోయిస్టులు లేఖలో డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story