విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జగన్‌కు పట్టదా : మధు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం జగన్‌కు పట్టదా అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు మధు ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోకపోవడానికి తన మీద ఉండే కేసుల భయమే కారణమని ఆరోపించారు. కౌలు రైతులు సహా రాష్ట్ర ప్రజల సమస్యలు జగన్‌కు పట్టవు కానీ.. ప్రతిపక్షాలపై కక్ష సాధింపులకు చట్టాలు ఉపయోగిస్తారని విమర్శించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్‌పరం కాకుండా బిడ్ వేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమని విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ ఛైర్మన్ సి.హెచ్ నరసింగరావు అన్నారు. జగన్ తన సొంత ప్రయోజనాల కోసమే కేంద్రంతో మాట్లాడటం లేదని దుయ్యబట్టారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అయితే జగన్ ప్రభుత్వం.. మొదటి ముద్దాయిగా నిలిచిపోవడం ఖాయమని నరసింగరావు తేల్చిచెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com