Khammam : బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఘోర ప్రమాదం, ఒకరు మృతి

Khammam : బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఘోర ప్రమాదం, ఒకరు మృతి
X

బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఖమ్మంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో గ్యాస్ సిలిండర్ పేలి ఒకరు మృతి చెందగా, ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించారు స్థానికులు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కార్యకర్తల అత్యుత్సాహమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. కారేపల్లి మండలం చీమలపాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాలనుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు. దగ్గరలోని ఓ గుడిసెలో వంటలు వండుతుండగా, కొందరు కార్యకర్తలు పటాకులు కాల్చారు. దీంతో పటాకులు దూసుకెళ్లి గ్యాస్ సిలిండర్ పై పడ్డాయి. ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా... మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Tags

Next Story