10th పేపర్‌ లీక్‌: బండి సంజయ్‌ పీఏ లేకపోవడంతో ప్రెస్‌నోట్‌ నేనే రాశా

10th పేపర్‌ లీక్‌: బండి సంజయ్‌ పీఏ లేకపోవడంతో ప్రెస్‌నోట్‌ నేనే రాశా
X

తనపై పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగానే కేసు నమోదు చేసారని ప్రశాంత్ అన్నారు. టెన్త్ హిందీ పేపర్ లీకేజీ కేసులో అరెస్ట్ అయి విడుదలైన ప్రశాంత్.. అసలేం జరిగిందో వివరించారు. ఈనెల 4న ఉదయం 10 గంటల 5 నిమిషాలకు వాట్సాప్‌లో టెన్త్ పేపర్ వచ్చిందన్నారు. తర్వాత ఉదయం 10 గంటలకు 46 నిమిషాలకు తాను తన ఫోన్‌లో క్వశ్చన్ పేపర్ చూసానని తెలిపారు. అనంతరం తనకు తెలిసిన జర్నలిస్టులకు షేర్ చేశానని చెప్పారు. తాను బండి సంజయ్‌తో ఫోన్‌లో 40 సెకన్లు మాట్లాడానని స్పష్టంచేసిన ప్రశాంత్.. తన పీఏ అందుబాటులోకి లేకపోవడంతో ప్రెస్‌నోట్ రాయాలని కోరారని తెలిపారు. అయితే ఈనెల 4న సాయంత్రం 6 గంటలకు పోలీసులు తనను ప్రశ్నించారన్నారు. తన ఫోన్ లాక్ ఓపెన్ చేసి పోలీసులకు ఇచ్చానని వివరించారు. 8 ఏళ్లుగా విద్యార్థుల కోసం తాను పోరాటం చేస్తున్నానన్న ప్రశాంత్.. తాను ఏ తప్పు చేయలేదని స్పష్టంచేశారు.

Tags

Next Story